ఎన్టీఆర్ సినిమాలో విజయ్ దేవరకొండ ?

Published on Oct 3, 2018 5:20 pm IST

నందమూరి బాలకృష్ణ నిర్మాణంలో.. ఆయన తండ్రి ‘నందమూరి తారకరామారావు’ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ చిత్రం, ప్రస్తుతం దివిసీమలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి తెరకెక్కిస్తున్నారు. చరిత్ర కలిగిన గొప్ప గొప్ప పాత్రలు ఉన్న ఈ చిత్రంలో.. ఆ పాత్రల స్థాయికి తగట్లుగానే ఈ చిత్రంలో భారీ తారాగణం నటిస్తోంది.

కాగా ఈ చిత్రంలో తెలాంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్ర కూడా ఈ సినిమాలో చూపించనున్నారని ఇటీవలే మేము తెలిపిన సంగతి తెలిసిందే. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పుడు ఆ పాత్రలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ నటించబోతున్నట్లు సమాచారం. కేసీఆర్ పాత్రకు విజయ్ అయితే బాగుంటాడని దర్శకనిర్మాతలు బావిస్తున్నారట. ఇక స్వతహాగా ఎన్టీఆర్ కి కేసీఆర్ వీరాభిమాని. పైగా కేసీఆర్ రాజకీయ జీవితానికి పునాది వేసింది ఎన్టీఆరే. అందుకే ఈ చిత్రంలో కేసీఆర్ ని చూపిస్తున్నారు.

మరో రెండు నెలల్లో ఈ చిత్రం టాకీ పార్ట్ ని పూర్తి చెయ్యాలని క్రిష్ భావిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ట్యూన్స్ కూడా అద్భుతంగా వచ్చాయట. ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి, యువ నిర్మాత విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :