ఎన్టీఆర్ సినిమాకి అనిరుధ్ సంగీతం.. నిజమేనా ?

ఎన్టీఆర్ సినిమాకి అనిరుధ్ సంగీతం.. నిజమేనా ?

Published on May 23, 2021 12:00 AM IST

‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ – స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో పాన్ ఇండియా సినిమా వస్తుందని ఎనౌన్స్ చేసిన దగ్గర నుండి ఈ సినిమా పై అనేక రూమర్స్ వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకి అనిరుధ్ సంగీతం అందించనున్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో చూడాలి. ఇక ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను అందుకోవడానికి ప్రస్తుతం కొరటాల స్క్రిప్ట్ వర్క్ పై కూర్చున్నాడు. ఎలాగూ కరోనా సెకెండ్ వేవ్ కారణంగా ఆచార్యకి షూట్ కి గ్యాప్ వచ్చింది.

కాగా ఈ గ్యాప్ ను కొరటాల ఎన్టీఆర్ స్క్రిప్ట్ కోసం వాడుకుంటున్నాడు. ఇక ఎప్పటిలాగే ఈ సినిమాను కూడా కొరటాల మెసేజ్ తో సాగే పక్కా ఎంటర్ టైనర్ గా తీస్తాడట. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉండేలా కొరటాల ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఏప్రిల్‌ 22, 2022న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇప్పటికే విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించారు. పైగా ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ పెద్ద హిట్ కావడంతో ఈ సినిమా పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు