తారక్ మరో గ్రాండ్ షోపై లేటెస్ట్ అప్డేట్.!

Published on Jul 2, 2021 9:00 am IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పలు భారీ చిత్రాలు ఒప్పుకున్నా సంగతి తెలిసిందే.. అలాగే సిల్వర్ స్క్రీన్ పై ఎలా అయితే యంగ్ టైగర్ తన స్క్రీన్ ప్రెజెన్స్ ని పంచి ఆశ్చర్యపరిచాడో అంతకు మించిన స్థాయిలోనే స్మాల్ స్క్రీన్ పై కూడా తన మొట్ట మొదటి షో బిగ్ బాస్ సీజన్ 1 తో అదరగొట్టేసాడు. ఇక ఆ తర్వాత నుంచి మళ్ళీ తారక్ దర్శనం సినిమాల టెలికాస్ట్ అప్పుడు తప్ప ఏ షోలో కూడా మళ్ళీ కనిపించలేదు.

అయితే బిగ్ బాస్ లానే మరో హిట్ అండ్ గ్రాండ్ రియాలిటీ షో అయినటువంటి “ఎవరు మీలో కోటీశ్వరుడు” అనే షో తో జెమినీ ఛానెల్లో రీఎంట్రీ ఇవ్వడంతో మరోసారి స్మాల్ స్క్రీన్ షేక్ అయ్యింది. అయితే ఈ అనౌన్సమెంట్స్ వచ్చి చాలా కాలమే అయ్యిపోయింది కానీ మళ్ళీ ఎలాంటి మూమెంట్ పెద్దగా కనిపించపోవడంతో ఈ షో నిలిచిపోయింది అనే స్థాయి వరకు వెళ్ళిపోయింది.

కానీ ఎట్టకేలకు ఈ షోపై లేటెస్ట్ అప్డేట్ వినిపిస్తుంది. తారక్ మళ్ళీ సూట్ వేసుకొని ఈ షో షూట్ నిమిత్తం వచ్చే వారం నుంచి పాల్గొననున్నాడట. ముందు కొన్ని ఎపిసోడ్స్ ను తారక్ కంప్లీట్ చేసెయ్యాలని ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఈ గ్రాండ్ షో ఎప్పుడు నుంచి మొదలు అవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :