ప్రభాస్ ‘ఆది పురుష్’ పై లేటెస్ట్ అప్ డేట్ !

Published on Apr 13, 2021 7:20 am IST

నేషనల్ స్టార్ ప్రభాస్ మొదటిసారిగా శ్రీరాముడిగా నటిస్తోన్నాడు అనగానే, ఒక్కసారిగా అందరిలోనూ ఆసక్తి రెట్టింపు అయింది. పైగా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా “ఏ- ఆది పురుష్” రాబోతుంది. బాలీవుడ్ బడా ద‌ర్శ‌కుడు సంజ‌య్ రౌత్ దర్శకత్వంలో దాదాపు 500 కోట్ల బ‌డ్జెట్ తో ఈ సినిమా తెర‌కెక్కుతుంది. కాగా ఈ దర్శకుడు ఈ సినిమా పనులను కొన్నిరోజులు పాటు పోస్ట్ ఫోన్ చేశాడట. యూనిట్ లోని ఒకరు ఇద్దరికీ కరోనా రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడట.

కాగా లేటెస్ట్ టెక్నాలజీతో తయారయ్యే సినిమాలో భారీ సెట్లు, భారీ క్రూ వగైరా వ్యవహారాలు లాంటివి లేకుండా మోషన్ కాప్చర్ విధానంలో నటీనటుల కదలికలు, హావభావాలు రికార్డుచేసి, వాటికి సాంకేతికత సాయంతో మిగిలిన హంగులను జోడిస్తారట. ఇక ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఆదికావ్యం రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను బాలీవుడ్ సంస్థ టీసిరీస్ ప్రభాస్ తో చేయడం నిజంగా విశేషమే.

సంబంధిత సమాచారం :