ప్రభాస్ తమ్ముడిగా టైగర్ ష్రాఫ్ !

Published on Jan 25, 2021 1:00 pm IST

బాలీవుడ్ బడా ద‌ర్శ‌కుడు సంజ‌య్ రౌత్ దర్శకత్వంలో రానున్న “ఏ- ఆది పురుష్” నేషనల్ స్టార్ ప్రభాస్ రాముడిగా, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. సీతగా కృతి సనోన్‌ నటిస్తోంది. అయితే మరో కీలక పాత్ర అయిన లక్ష్మణుడి పాత్రలో ఎవరు నటిస్తున్నారు అంటూ నెటిజన్లు గత కొన్ని రోజులుగా ఆరా తీస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా లక్ష్మణుడు దొరికినట్టు తెలుస్తోంది. బాలీవుడ్ యంగ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ లక్ష్మణుడిగా నటించబోతున్నాడు.

ఇక దాదాపు 500 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కిస్తున్న ఈ సినిమా ఆదికావ్యం రామాయణం ఆధారంగా తెరకెక్కుతుంది. కాగా బాలీవుడ్ సంస్థ టీసిరీస్ ఏ బాలీవుడ్ స్టార్ తోనో ఇలాంటి భారీ సినిమాను చేయకుండా, సౌత్ హీరో అయిన ప్రభాస్ తో చేయడం నిజంగా విశేషమే. అన్నట్టు ఈ సినిమాని 3డి విజువ‌ల్ గ్రాఫిక్స్ తో ఒక మ‌హ‌దాద్భుతంగా తెర‌కెక్కించి దేశంలోని అన్ని భాష‌లతో పాటు విదేశాల్లోనూ భారీగా రిలీజ్ చేయనున్నారు. ఇక తన మార్కెట్ కి తగ్గట్లుగానే బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలను సెట్ చేసుకుంటూ ప్రభాస్ ముందుకు పోతున్నాడు

సంబంధిత సమాచారం :