“పుష్ప ది రైజ్” షూట్ పై లేటెస్ట్ అప్డేట్ ఇదే.!

Published on Aug 31, 2021 6:11 pm IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “పుష్ప”. రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్న ఈ చిత్రంలో మొదటి పార్ట్ “పుష్ప ది రైజ్” ఇప్పుడు ఫైనల్ స్టేజ్ షూట్ లో ఉండగా దీనిపై లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు తెలుస్తుంది. ఈ చిత్రంలో ఇది వరకే కీలక సన్నివేశాలను తెరకెక్కించిన మారేడుమిల్లి అడవుల్లో మళ్ళీ షూట్ ని ప్లాన్ చేశారట.

వచ్చే సెప్టెంబర్ 2న ఈ షూట్ స్టార్ట్ అవుతుందట అలాగే అక్టోబర్ నాటికి సినిమా కంప్లీట్ గా పూర్తి అయ్యిపోనుంది అని తెలుస్తుంది. ఇక అక్కడ నుంచి శరవేగంగా అన్ని పనులు కంప్లీట్ చేసేసి క్రిస్మస్ కి రిలీజ్ చేసేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యినట్టు టాక్. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :