రాజశేఖర్ ఆరోగ్యంపై తాజా అప్డేట్.!

Published on Oct 29, 2020 11:00 am IST

గత కొన్ని రోజుల కితమే టాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటుడు రాజశేఖర్ మరియు అతని కుటుంబానికి కరోనా సెగ తగిలిన సంగతి తెలిసిందే. అయితే వారిలో తమ ఇద్దరు కూతుర్లు శివాత్మిక మరియు శివానీలు తొందరగానే కోలుకున్నారు. కానీ రాజశేఖర్ ఆరోగ్యం అప్పుడు విషమించింది అని వచ్చిన వార్త షాకివ్వగా అక్కడ నుంచి ఆయన కోలుకోణాల్ని సినీ ప్రముఖులు కోరుకున్నారు. అయితే అక్కడ నుంచి చికిత్స పొందుతున్న రాజశేఖర్ ఆరోగ్యం మెరుగవ్వడం ప్రారంభించింది.

ఇప్పుడు అందుతున్న తాజా సమాచారం ప్రకారం రాజశేఖర్ ఆరోగ్యం ప్రతీ రోజు అంతకంతకు మెరుగవుతున్నట్టు తెలుస్తుంది. అలాగే రాజశేఖర్ సతీమణి జీవితా చెబుతున్న దాని ప్రకారం ఇపుడు రాజశేఖర్ ఆరోగ్యం మెరుగవుతుందని అలాగే శరీరంలోని వైరస్ వల్ల కలిగిన ఇన్ఫెక్షన్ తగ్గిందని తెలిపారు. అలాగే పలు పరీక్షల అనంతరం ఆయన్ను ఐసీయూ నుంచి తరలించనున్నారని ఆమె తెలిపారు. ఆయన పూర్తిగా కోలుకోవాలని మనం కూడా కోరుకుందాం.

సంబంధిత సమాచారం :

More