రజినీ “అన్నాత్తే” షూట్ పై లేటెస్ట్ అప్డేట్.!

Published on Mar 23, 2021 11:00 am IST

తమిళ్ తలైవర్ సూపర్ స్టార్ రజినీ ఒక స్ట్రాంగ్ కం బ్యాక్ కోసం చాలా మందే ఎదురు చూస్తున్నారు. తన స్టైల్ మరియు స్టార్డం కు తగ్గ సినిమా వచ్చి చాలా కాలమే అయ్యింది. దీనితో ఇప్పుడు అంచనాలు అన్నీ కోలీవుడ్ స్టార్ దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న “అన్నాత్తే”పై భారీ అంచనాలు సెట్టయ్యాయి. ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్న ఈ చిత్రం మధ్యలో కోవిడ్ వల్ల రజినీ ఆరోగ్యం క్షీణించడం వల్ల వాయిదా పడింది.

కానీ ఇటీవలే మళ్ళీ మొదలయ్యి శరవేగంగా పూర్తి అవుతుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది. ఈ చిత్రంలో ఇప్పుడు ఒక సాంగ్ షూట్ జరుగుతుందట రజినీ మరియు నయనతారల మధ్య ఈ సాంగ్ షూట్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ భారీ చిత్రానికి డి ఇమన్ సంగీతం అందిస్తుండగా రజిని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ రోబో నిర్మాత కళానిధిమారన్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :