నైజాంలో ‘పెద్ది’ బుకింగ్స్ పై లేటెస్ట్ అప్డేట్!

మరికొన్ని రోజుల్లో పాన్ ఇండియన్ సినిమా దగ్గర రిలీజ్ కి రాబోతున్న అవైటెడ్ టాలీవుడ్ చిత్రమే ‘పెద్ది’. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన మల్టీ స్పోర్ట్స్ డ్రామా ఇది కాగా భారీ అంచనాలు దీనిపై ఉన్నాయి. ఇక తెలుగులో అయితే ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో సినిమా విడుదలకి సంబంధించి ఒక్కో కీలక అంశం బయటకి వస్తున్నాయి.

ఆల్రెడీ ఏపీలో టికెట్ ధరల హైక్స్, షో టైమింగ్స్ వంటి వివరాలు బయటకి వచ్చేసాయి. అలాగే ఇప్పుడు నైజాం మార్కెట్ కి సంబంధించి లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది. దీని ప్రకారం ‘పెద్ది’ బుకింగ్స్ ఈ జూన్ 1 నుంచి అక్కడ మొదలు కానున్నాయి అని తెలుస్తుంది. అంతే కాకుండా దాదాపు నైజాం మార్కెట్ లో కూడా ఈ సినిమాకి హైక్స్ ఉండొచ్చనే టాక్. సో దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో జగపతి బాబు, బొమన్ ఇరానీ, శివ రాజ్ కుమార్ తదితరులు నటిస్తుండగా ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే ఈ జూన్ 4న సినిమా విడుదల కాబోతుంది.

Exit mobile version