రంగస్థలం సినిమాతో కెరీర్ లో ది బెస్ట్ హిట్ అందుకున్న రామ్ చరణ్ నెక్స్ట్ సినిమాతో కూడా అదే తరహాలో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక యాక్షన్ కథను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల షూటింగ్ స్టార్ట్ అయినా ఈ ప్రాజెక్ట్ మొదటి షెడ్యూల్ ని చాలా స్పీడ్ గా ఫినిష్ చేశారు. హైదరాబాదా లోని ప్రముఖ అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ యాక్షన్ సీన్స్ ని చిత్రీకరించారు.
అలాగే కొన్ని ఫ్యామిలీ సీన్స్ ని కూడా స్పెషల్ సెట్స్ వేసి షూట్ చేశారు. ఇక నెక్స్ట్ షెడ్యూల్ ని కూడా త్వరలోనే స్టార్ట్ చేయడానికి దర్శకుడు సన్నాహకాలు చేస్తున్నాడు. బ్యాంకాక్ లో ఈ నెల 12నుంచి ప్రారంభం కాబోయే షెడ్యూల్ ని దాదాపు 15 రోజుల వరకు నిర్వహించనున్నారు. కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను డివివి.దానయ్య భారీ బడ్జెత్ తో నిర్మిస్తున్నారు.
