అమితాబ్ సినిమా కోసం క్రేజీ బ్యూటీ కసరత్తులు !

Published on Apr 4, 2021 9:01 pm IST

క్రేజీ బ్యూటీ రష్మిక బాలీవుడ్ లో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన “మిషన్ మజ్ను” అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఆలాగే రష్మిక రెండో బాలీవుడ్ ప్రాజెక్ట్ ‘గుడ్ బై’. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ మెయిన్ హీరో. మరి అమితాబ్ సినిమాలో రష్మిక ఎలాంటి క్యారెక్టర్ పోషిస్తోందో చూడాలి. ఏక్తా కపూర్ నిర్మిస్తున్న ఈ మూవీ కొత్త షెడ్యూల్ షూటింగ్ వచ్చే వారం నుండి మొదలుకానుందని తెలుస్తోంది. కాగా రష్మిక ఈ సినిమా కోసం వరుసగా 20 రోజులు పాటు డేట్స్ ఇచ్చిందని, పైగా ఆమె తన పాత్ర కోసం కసరత్తులు కూడా మొదలుపెట్టిందని తెలుస్తోంది.

ఇక రష్మిక నటిస్తున్న ఆమె ఫస్ట్ బాలీవుడ్ మూవీ ‘మిషన్ మజ్ను’ అక్కడ భారీ అంచనాలు ఉన్నాయి. పైగా బాలీవుడ్ క్రేజీ యంగ్ హీరో సిద్దార్ట్ మల్హోత్రా సరసన నటిస్తుండంతో రష్మికకి అక్కడ మంచి పాపులారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఈ సినిమా కథ ప్రకారం సౌత్ ఇండియన్ భామ కావాలి కాబట్టి, రష్మికను వాళ్ళు తీసుకున్నారు. మరి ఈ రెండు సినిమాల్లో ఒక్క సినిమా సూపర్ హిట్ అయినా, రష్మికకు బాలీవుడ్ లో వరుస అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :