సాంగ్స్ కోసం రెడీ అవుతోన్న ‘డిస్కోరాజా’ !

సాంగ్స్ కోసం రెడీ అవుతోన్న ‘డిస్కోరాజా’ !

Published on Aug 19, 2019 10:26 PM IST

మాస్ మహారాజా రవితేజ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ వి ఐ ఆనంద్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం “డిస్కోరాజా”. కాగా ఈ సినిమాలో ర‌వితేజ సరసన హీరోయిన్స్ గా పాయల్ రాజ్ పుత్, నభా నటేష్, తాన్యా హోప్‌ ముగ్గురు నటిస్తున్నారు. ఇక ఇటివలే ఢిల్లీలో ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం హైదరాబాద్ లో తరువాత జరగబోయే షెడ్యూల్ లో రవితేజ మరియు హీరోయిన్స్ పై సాంగ్స్ ను షూట్ చేయనున్నారు. ఈ షెడ్యూల్ లో తాన్యా హోప్‌ పాల్గొంటుందట.

కాగా గ్లామ‌ర్ పరంగా తాన్యా హోప్ కి తిరుగులేకపోయినా.. ఆమెకు పెద్దగా అవకాశాలు మాత్రం రాలేదు. కనీసం ‘డిస్కోరాజా’తోనైనా తాన్యా హోప్ కి కాలం కలిసి వస్తోందేమో చూడాలి. ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత‌ రామ్ తళ్ళూరి ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో బాగానే అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు