రవితేజ “ఖిలాడి” షూట్ పై లేటెస్ట్ అప్డేట్.!

Published on Mar 24, 2021 11:00 am IST

లేటెస్ట్ గా మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన పక్కా మాస్ ఎంటర్టైనింగ్ చిత్రం “క్రాక్” ఎంత పెద్ద హిట్టయ్యిందో అందరికీ తెలిసిందే. మరి అలాగే ఈ చిత్రం అనంతరం దర్శకుడు రమేష్ వర్మతో స్టార్ట్ చేసిన ఫుల్ ఆన్ యాక్షన్ ఎంటెర్టైనర్ చిత్రం “ఖిలాడి”. ఇప్పుడు ఈ చిత్రం తాలూకా షూట్ శరవేగంగా జరుగుతుంది. మరి లేటెస్ట్ గా ఈ చిత్రం తాలూకా షూట్ పై అప్డేట్ వచ్చింది.

కొన్ని రోజుల కితమే ఓ సాంగ్ మరియు కీలక సన్నివేశాల షూట్ నిమిత్తం ఇటలీ వెళ్లిన చిత్ర యూనిట్ ఇప్పుడు ఆ షెడ్యూల్ ను ఈ మార్చ్ చివరి నాటికి కంప్లీట్ చేసే ప్లానింగ్ లో ఉన్నారట. ఎలా అయినా సరే ఈ చిత్రం మే 28న విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మాస్ మహారాజ్ డ్యూయల్ రోల్ లో నటిస్తుండగా డింపుల్ హయాతి మరియు మీనాక్షి చౌదరిలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :