‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ బాబాయ్ లేడట !

Published on Apr 9, 2020 10:03 pm IST

రాజమౌళి భారీ మల్టీస్టారర్ ‘రౌద్రం రణం రుధిరం’లో ఓ కీలక పాత్ర కోసం మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ను సంప్రదించాడని.. మోహన్ లాల్ కూడా ఆ ప్రత్యేక పాత్రలో నటించడానికి అంగీకరించారని.. మోహన్ లాల్ నటించే పాత్ర కొమరం భీమ్ బాబాయ్ పాత్ర అని ఇప్పటికే సోషల్ మీడియాలో అనేక వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తోంది. కొమరం భీమ్ జీవితంలో ఆయన బాబాయి పాత్ర చాల కీలకమైనదే. భీమ్ లో పోరాట తత్వాన్ని చిన్నప్పుడే ‘బీమ్ బాబాయ్’ బీమ్ కు నూరిపోశాడు అనేది కూడా వాస్తవమే.

అయితే ‘రౌద్రం రణం రుధిరం’ సినిమా భీమ్ యుక్త వయసు నుండి మొదలవ్వనుంది. ఆ కారణంగా కొమరం భీమ్ బాబాయ్ పాత్ర ను సినిమాలో పెట్టట్లేదని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండబోతుందని అని తారక్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. మే 20న తారక్ బర్త్ డే రోజున తారక్ పాత్ర మీద జక్కన్న రిలీజ్ చేసే వీడియో కోసం ఇప్పుడు అందరి చూపు ఉంది.

కాగా రాజమౌళి ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో రూపొందిస్తున్నాడు. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా పై ఆరంభం నుండి భారతీయ అన్ని సినీ పరిశ్రమల్లో అత్యున్నత భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :

X
More