ఆర్ ఆర్ ఆర్ మూవీ లేటెస్ట్ అప్డేట్

Published on Sep 15, 2019 10:00 pm IST

రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ ఆర్ ఆర్ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. కొద్దిరోజుల క్రితం ఎన్టీఆర్ పై పోరాట సన్నివేశాలతో పాటు, కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరణ కొరకు చిత్ర యూనిట్ బల్గెరీయా వెళ్లడం జరిగింది. అక్కడ షెడ్యూలు పూర్తికావడంతో యూనిట్ తిరిగి హైదరాబాద్ బయలుదేరినట్లు సమాచారం. ఎన్టీఆర్ సతీసమేతంగా నేడు విమానాశ్రయంలో కనిపించడంలో ఈ విషయం ధృవీకృతం అయ్యింది.

ఇక తదుపరి షెడ్యూలు త్వరలో మొదలుకానుంది సమాచారం. ఆ షెడ్యూల్ నందు రామ్ చరణ్ పాల్గొనే అవకాశం కలదు. డివివి దానయ్య నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రంలో అలియా భట్, అజయ్ దేవగణ్, సముద్ర ఖని వంటి ప్రముఖ నటులు నటిస్తుండగా, వచ్చే ఏడాది జులై 30న విడుదల కానుంది.
latest update on rrr movie

సంబంధిత సమాచారం :

X
More