లేటెస్ట్ అప్డేట్..”RRR” షూట్ పూర్తి..కానీ దీన్ని మిస్ చేశారే.!

Published on Aug 26, 2021 3:16 pm IST

ప్రస్తుతం ఇండియన్ సినిమా అంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రాల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న “రౌద్రం రణం రుధిరం” కూడా ఒకటి. ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ గానే కాకుండా బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ చిత్రం కూడా ఇది. మరి ఎప్పటికప్పుడు ఆసక్తికర అప్డేట్స్ ని ఇస్తూ వస్తున్న మేకర్స్ మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని అందించారు.

ఈ చిత్రం షూట్ అంతా కూడా కంప్లీట్ అయ్యిపోయినట్టుగా ఇపుడు అధికారికంగా తెలియజేసారు. మరి అలాగే ఇంకా కొంత మేర చిన్న చిన్న షాట్స్ మాత్రమే బ్యాలన్స్ ఉన్నాయని అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా త్వరలోనే స్టార్ట్ చేస్తున్నట్టుగా తెలిపారు. అంతే కాకుండా రానున్న రోజుల్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ని ఇవ్వనున్నట్టుగా తెలియజేసారు.

అయితే ఈ అప్డేట్ పోస్టర్ తోనే ఇంకో క్లారిటీ కూడా ఇచ్చినట్టే అని చెప్పాలి. ఇన్ని రోజులు కూడా ఈ చిత్రం ప్రతి పోస్టర్, బ్యానర్ లో కొత్త రిలీజ్ డేట్ అక్టోబర్ 13ని వేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఇందులో దానిని మిస్ చేశారు. సో ఇక ఈ చిత్రం ఈ ఏడాది లేనట్టే అని చెప్పాలి. కొత్త డేట్ పై కూడా రానున్న రోజుల్లో అనౌన్స్మెంట్ రానుంది అని టాక్ ఉంది. మరి అది ఎప్పుడు వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :