ప్రభాస్ “సలార్” షూట్ పై లేటెస్ట్ అప్డేట్.!

Published on Jun 30, 2021 2:00 pm IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రస్తుత పాన్ ఇండియన్ చిత్రాల్లో సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ “సలార్” కూడా ఒకటి. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం షూటింగ్ కూడా ప్రోగ్రెస్ లో ఉంది.

అయితే ఇప్పుడు ప్రభాస్ ప్లాన్ ప్రకారం “రాధే శ్యామ్” షూటింగ్ కంప్లీట్ పనిలో ఉన్నారు. మరి దీని తర్వాత “సలార్” అలాగే “ఆదిపురుష్” లను లైన్ గా జూలై మరియు సెప్టెంబర్ కి అలా షూటింగ్ లలో పాల్గొనాలని ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు సలార్ ప్లాన్ మారినట్టు తెలుస్తుంది.

ఈ చిత్రం జూలై నుంచి ఆగష్టు కి షిఫ్ట్ అయ్యినట్టు టాక్. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది. మరి ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా కేజీయఫ్ టెక్నీషియన్స్ నే పని చేస్తుండగా.. అదే చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే..

సంబంధిత సమాచారం :