ప్రభాస్ ‘సలార్’ పై లేటెస్ట్ అప్ డేట్ !

ప్రభాస్ ‘సలార్’ పై లేటెస్ట్ అప్ డేట్ !

Published on Jun 3, 2021 10:08 PM IST

ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ లాంటి హై వోల్టేజ్ మూవీ తీసిన ‘ప్ర‌శాంత్ నీల్’ దర్శకత్వంలో “సలార్” సినిమా వస్తోంది అనగానే పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ సినిమా షూటింగ్ పై ఒక లేటెస్ట్ అప్ డేట్ తెలిసింది. జూన్ సెకెండ్ వీక్ నుండి కొత్త షెడ్యూల్ ను స్టార్ట్ చేయనున్నాడని తెలుస్తోంది. ఇక ఈ షెడ్యూల్ లో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ తీయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో శ్రుతి హాసన్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా శ్రుతి హాసన్ ఈ సినిమా వచ్చే షెడ్యూల్ షూట్ లో పాల్గొనబోతుంది.

ఒక జర్నలిస్ట్ పాత్రలో శ్రుతి హాసన్ ఈ సినిమాలో కనిపించబోతుంది. అలాగే ఆమె పాత్రకు సంబంధించిన ట్విస్ట్ కూడా సినిమాలో హైలైట్ గా ఉంటుందట. కాగా హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ ప్లేస్ లో వేసిన సెట్ లో ఈ సినిమా షూట్ స్టార్ట్ చేస్తారట. 2021లో లోపే ఈ సినిమాని పూర్తీ చేయాలని చూస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమా కోసం బల్క్ డేట్స్ కేటాయించాడు. ఎలాగూ ప్రభాస్ కూడా సలార్ పైనే ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు కాబట్టి.. ఈ సినిమా పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు