టాలీవుడ్ కాదు సందీప్ వంగా మళ్ళీ బాలీవుడ్ లోనే

Published on Sep 15, 2019 1:19 pm IST

అర్జున్ రెడ్డి చిత్రంతో మోస్ట్ పాపులర్ దర్శకులలో ఒకరిగా మారారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ఇక ఆయన తీసిన అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ ఘనవిజయంలో దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. ఐతే ఆయన తదుపరి చిత్రం పై అనేక ఉహాగానాలు కొద్దిరోజులుగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో నేడు మరో వార్త తెరపైకొచ్చింది. ఆయన మళ్ళీ బాలీవుడ్ హీరోతోనే సినిమా చేస్తున్నారట.

బాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన రణ్వీర్ కపూర్ తో ఆయన చిత్రం దాదాపు ఫైనల్ అయినట్టు తెలుస్తుంది. డెవిల్ అనే పవర్ ఫుల్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో రణ్వీర్ నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో కనిపిస్తారని సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని తెలుస్తుంది. ఎప్పటినుండో సందీప్ రెడ్డి వంగా సూపర్ స్టార్ మహేష్ తో సినిమా చేయనున్నారని వార్తలు వస్తున్న తరుణంలో ఈతాజా న్యూస్ మళ్ళీ వారి కాంబినేషన్ లో మూవీని సందిగ్ధంలో పడవేసింది.

సంబంధిత సమాచారం :

X
More