“సర్కారు వారి పాట” షూట్ పై లేటెస్ట్ అప్డేట్.!

Published on Aug 25, 2021 9:00 am IST

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల కాంబోలో “సర్కారు వారి పాట” అనే సాలిడ్ ఎంటర్టైనర్ ని తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు శరవేగంగా షూట్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఇటీవల గోవా షెడ్యూల్ నిమిత్తం వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ లతో ఒక మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీక్వెన్స్ ని ప్లాన్ చేశారు.

అయితే అది నిన్నటితో కంప్లీట్ అయ్యినట్టుగా లేటెస్ట్ అప్డేట్. అంతే కాకుండా ఈ సీక్వెన్స్ అవుట్ పుట్ కూడా చాలా బాగా వచ్చిందని తెలుస్తుంది. ఇక దీని నుంచి మహేష్ స్వల్ప విరామం తీసుకొని నెక్స్ట్ షెడ్యూల్ ని స్టార్ట్ చేయనున్నాడని సమాచారం. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :