బాలు గారి ఆరోగ్యంపై తాజా అప్డేట్.!

బాలు గారి ఆరోగ్యంపై తాజా అప్డేట్.!

Published on Aug 16, 2020 12:45 PM IST

balasubrahmanyam

భారత సంగీత ప్రస్థానంలో లెజెండరీ గాయకులూ ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం గారు ఇటీవలే కోవిడ్ బారిన పడిన సంగతి అందరికీ తెలిసిందే. మొదట్లో తాను ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పి ధైర్యం ఇచ్చిన బాలు గారికి సంబంధించి గత రెండు రోజులుగా ఆయన ఆరోగ్యం క్షీణించింది అని వచ్చిన వార్తలు ఒక్కసారికి షాక్ కు గురిచేశాయి. దీనితో ప్రతీ ఒక్కరు ఆయన త్వరగా కోలుకోవాలని ఎంతగానో కోరుకున్నారు.

అయితే చెన్నై లో చికిత్స పొందుతున్న బాలు గారి ఆరోగ్యంకు సంబంధించి తాజా అప్డేట్ ఒకటి ఇప్పుడు తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ చికిత్స చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందట. అలాగే క్రమక్రంగా ఆయన ఆరోగ్యం మెరుగవుతున్నట్టునా చెన్నై ఎం జి ఎం ఆసుపత్రి వారు తెలిపినట్టు ఇప్పుడు సమాచారం. ఆయన మరింత త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు