ముదురుతున్న ‘సైరా’ వివాదం

ముదురుతున్న ‘సైరా’ వివాదం

Published on Sep 27, 2019 12:12 AM IST

‘సైరా’ చిత్రానికి కథ విషయంలో సహకారం అందించినందుకుగాను ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులమైమ తమకు చిత్ర నిర్మాత రామ్ చరణ్ డబ్బు ఇస్తానని మాటిచ్చి ఇప్పుడు ఇవ్వకుండా మోసం చేశారని నరసింహారెడ్డి వారసులు కోర్టులో పిటిషన్ వేశారు. ‘సైరా’కు సెన్సార్ సర్టిఫికెట్ జారీని, చిత్ర విడుదలను నిలిపివేయాలని ఆ పిటిషన్లో పేర్కొన్నారు.

గురువారం ఈ పిటిషన్ విచారణకు రాగా చిత్రానికి ఎలాంటి సర్టిఫికెట్ ఇవ్వలేదని సెన్సార్ బోర్డ్ తెలిపిందట. దీంతో కోర్టు విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఇక విచారణలో దర్శకుడు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇదసలు బయోపిక్ కాదని తెలిపారని వార్తలొస్తున్నాయి. ఏది ఏమైనా విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్ది ఈ వివాదం మరింత ముదురుతూ వెళుతోంది. కాబట్టి చరణ్ అక్టోబర్ 2 విడుదలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్వరగా వివాదాన్ని పరిష్కరించుకుంటే మంచిది.

తాజా వార్తలు