‘సైరా’ గురించి లేటెస్ట్ అప్ డేట్ !

‘సైరా’ గురించి లేటెస్ట్ అప్ డేట్ !

Published on Nov 3, 2018 3:50 AM IST

Sye Raa1

సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి చేస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం మళ్లీ షూటింగ్ మొదలు అవ్వనుంది. రెండు వారాల క్రితం జార్జియాలో జరుపుకున్న లాంగ్ షెడ్యూల్లో కీలకమైన క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరించారు. అలాగే భారీ యుద్ధ సన్నివేశాల నేపథ్యంతో కూడిన క్లైమాక్స్ ను కూడా కెమెరామెన్ రత్నవేలు ఓ భారీ పరికరంతో చిత్రీకరించిన విషయం తెలిసిందే.

కాగా రెండు వారాలు పాటు రెస్ట్ తీసుకున్న చిత్రబృందం త్వరలోనే షూట్ మొదలు పెట్టనుంది. హైదరాబాద్ లో షూట్ జరపనున్నారు. ఇప్పుడు తియ్యబోయే సన్నివేశాలు సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని చెబుతుంది చిత్రబృందం. ఇక ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు