విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్‌రామ్ కాంబినేషన్లో అనిల్ రావిపూడి తెరక్కిస్తున్న సినిమా ‘జనవరి 12 విడుదల’. కాగా ఈ సినిమా కామెడీ విషయంలో భారీ అంచనాలు ఉన్నాయి. బావ–బామ్మర్ది మధ్య జరిగే సరదా సన్నివేశాలు, పరిస్థితుల నుంచి క్రియేట్ అయ్యే కామెడీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. వెంకటేష్ టైమింగ్, కళ్యాణ్‌రామ్ కొత్త తరహా కామెడీ యాంగిల్‌కు అనిల్ రావిపూడి మార్క్ పంచ్‌లు తోడైతే థియేటర్లలో మంచి నవ్వులు పూయించే అవకాశం ఉంది.
పైగా సంక్రాంతి ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేసేలా కామెడీ, ఎమోషన్, యాక్షన్ కలగలిసిన పూర్తి ఎంటర్టైనర్గా సినిమా ఉండొచ్చని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సాహు గారపాటి నిర్మాణంలో రానున్న ఈ సినిమాకు జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. అన్నట్టు ఈ సినిమాలో అల్ట్రా స్టైలిష్ లుక్‌లో వెంకీ కనిపిస్తారట.. ఈ లుక్ కి పూర్తి భిన్నంగా కళ్యాణ్ రామ్ లుక్ ఉంటుందని తెలుస్తోంది. పైగా స్టోరీ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. ఇక నవంబర్ లోపు ఈ సినిమా షూట్ పూర్తి చేయాలని దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడు.


