ఎన్టీఆర్ , త్రివిక్రమ్ సినిమా లేటెస్ట్ న్యూస్ !

త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించబోయే సినిమా మొదటి షెడ్యూల్ వచ్చే నెల 12 నుండి హైదరాబాద్ లో ప్రారంభం కానుందని సమాచారం. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా హారికా హాసిని బ్యానర్లో చినబాబు నిర్మిస్తున్నాడు. ఎన్టీఆర్ ఈ సినిమాలో ఆర్మీ అధికారి పాత్రలో కనిపించబోతున్నాడు. అందుకోసం తన లుక్ ను పూర్తిగా మార్చుకున్నాడు కూడ.

త్రివిక్రమ్ స్టైల్ లో ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్, పంచ్ డైలాగ్స్ ఉండబోతున్నాయని సమాచారం. ‘మనం’ సినిమా కెమెరా మెన్ వినోద్ ఈ సినిమాకు సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటులను ఎంపిక చేసే పనిలో ఉన్నాడు. త్వరలో ఈ మూవీ గురించి మరింత సమాచారం తెలియనుంది.