‘నితిన్’ యాక్షన్ థ్రిల్లర్ లో నభా ?

Published on Nov 20, 2023 11:06 pm IST

‘ఛలో ‘భీష్మ సినిమాలతో తన ఖాతాలో భారీ విజయాలను నమోదు చేసుకున్న వెంకీ కుడుముల దర్శకత్వంలో – నితిన్ హీరోగా మరో సినిమా వస్తోంది. ఐతే, ఈ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఈ క్రమంలో యంగ్ బ్యూటీ నభా నటేష్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె పాత్ర సెకండ్ హాఫ్ లో వస్తోందని తెలుస్తోంది. నభా కోసం ఓ స్పెషల్ సాంగ్ ను కూడా వెంకీ కుడుముల డిజైన్ చేశాడట.

కాగా, ‘ఛలో ‘భీష్మ సినిమాలోని ఫన్ కంటే ఈ సినిమాలో ఫన్ ఇంకా అద్భుతంగా ఉంటుందట. అలాగే ఈ సినిమాలో హీరో – హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ కూడా ఫుల్ ఎంటర్ టైన్ గా ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ భారీ తారాగణంతో భారీ స్థాయిలో నిర్మించబోతుంది. ఎలాగూ భీష్మ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్ళను సాంధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దాంతో వెంకీ కుడుముల – నితిన్ సినిమా పై ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి ఏర్పడింది. మరి ఈ సినిమాతో ఈ హిట్ కాంబినేషన్ ఏ రేంజ్ హిట్ ను కొడుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :