విజయ్, గౌతమ్ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ అప్డేట్


టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా నటించిన రీసెంట్ చిత్రం “ది ఫ్యామిలీ స్టార్” (The Family Star) తో ఆడియెన్స్ ని పలకరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా అనుకున్న రేంజ్ విజయాన్ని అందుకోలేదు ఇక దీనితో విజయ్ అభిమానులు అంతా తన నెక్స్ట్ సినిమాలు కోసమే ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ చిత్రాల్లో విజయ్ కెరీర్ 12వ చిత్రం టాలెంటెడ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో ప్లాన్ చేసిన భారీ ప్రాజెక్ట్ కూడా ఒకటి. మరి ఈ చిత్రం రీసెంట్ గానే షూట్ స్టార్ట్ కాగా గౌతమ్ ఈ సినిమాకి చేస్తున్న ప్లానింగ్ లు ఫ్యాన్స్ కి ఆశ్చర్యానికి లోను చేసాయి. మరి లేటెస్ట్ గా అయితే సినిమా సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ ని స్టార్ట్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది.

హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో మొదలైనట్టుగా సమాచారం. మొత్తానికి అయితే ఈ సినిమా విషయంలో రౌడీ బాయ్స్ చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version