దేవరకొండను డైరెక్ట్ చేయనున్న హుషారు డైరెక్టర్ !

Published on Feb 4, 2019 11:43 pm IST

‘హుషారు’ చిత్రం తో టాలీవుడ్ లోకి డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు శ్రీ హర్ష కొనుగంటి. ఇటీవల విడుదలైన ఈ చిత్రం యువత ను బాగా ఆకట్టుకుంది. దాంతో ఈ దర్శకుడి భారీ ఆఫర్ వచ్చింది. తన రెండో చిత్రాన్ని సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తో చేయనున్నాడు. అయితే ఈచిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలుబడనున్నాయి.

ప్రస్తుతం విజయ్ డియర్ కామ్రేడ్ అలాగే క్రాంతి మాధవ్ దర్శకత్వంలో సినిమాలతో బిజీ గా వున్నాడు. ఇక హుషారు చిత్రం తమిళ , హిందీ భాషల్లో రీమేక్ కానుంది. ఈ చిత్రాలకు కూడా శ్రీ హర్ష నే డైరెక్ట్ చేయమని ఆఫర్ వచ్చిన ఆయన తిరస్కరించాడట.

సంబంధిత సమాచారం :