స్పీడ్ పెంచిన చైతు.. వెంకీతో కూడా !

Published on May 17, 2021 7:00 am IST

అక్కినేని నాగ చైతన్య సినిమాల ఎంపికలో స్పీడ్ పెంచాడు. ఒకప్పుడు స్లోగా సినిమాలు చేసే చైతు, ప్రస్తుతం గ్యాప్ లేకుండా సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ సినిమాని పూర్తి చేశాడు. ప్రజెంట్ విక్రమ్ కుమార్ డైరెక్షన్లో ‘థాంక్యూ’ సినిమా షూటింగ్ లో కూడా మొన్నటి వరకూ పాల్గొన్నాడు. థాంక్యూ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది.

అలాగే నాగ చైతన్య బాలీవుడ్ లో కూడా అరంగేట్రం చేయబోతున్నాడు. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ హీరోగా రానున్న ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాలో చైతు నటిస్తున్నాడు. ఈ సినిమాలో నాగచైతన్య పాత్ర 18 నిమిషాల పాటు ఉంటుందని.. ఒక తెలుగు కుర్రాడి పాత్రలో చైతు కనిపించబోతున్నాడని మొత్తానికి ఇదొక గెస్ట్ రోల్ అని తెలుస్తోంది. జూన్ నుండి ఈ సినిమా షూటింగ్ లడఖ్ లో మొదలు కానుంది. అలాగే చైతు, వెంకీ కుడుములతో కూడా ఒక సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :