‘ఆర్సీ 12’ లేటెస్ట్ అప్ డేట్స్ !

Published on Oct 31, 2018 12:46 pm IST

బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 12వ చిత్రం యొక్క టాకీ పార్ట్ షూటింగ్ నవంబర్ 10వ తేదిలోపు పూర్తి కానుంది. ఇంకా రెండు సాంగ్స్ షూట్ మాత్రమే బ్యాలెన్స్ వుంది. నవంబర్ 9నుండి ఈ చిత్రం యొక్క డబ్బింగ్ పనులు ప్రారంభం కానున్నాయి.

ఇక ఈ చిత్రం అనుకున్న సమయానికి విడుదలకాదని ఇటీవల వచ్చిన రూమర్లకు చెక్ పెట్టింది చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ . వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల ఖాయమని కొద్దీ సేపటి క్రితం అధికారకంగా ప్రకటించింది. అలాగే ఈచిత్రం యొక్క ఫస్ట్ లుక్ మరియు టైటిల్ విడుదల తేదీని కూడా అతి త్వరలో ప్రకటిస్తామని తెలియజేసింది. అన్ని కుదిరితే ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ దీపావళి కి విడుదలయ్యే అవకాశాలు వున్నాయి.

హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా సీనియర్ హీరోలు ప్రశాంత్ , ఆర్యన్ రాజేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :