లేటెస్ట్ : షూటింగ్ కంప్లీట్ చేసుకున్న వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’

లేటెస్ట్ : షూటింగ్ కంప్లీట్ చేసుకున్న వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’

Published on Oct 19, 2023 10:35 PM IST

mission 1

యువ నటుడు వరుణ్ తేజ్ హీరోగా శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ భారీ ఎయిర్ యాక్షన్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్. ఈ మూవీలో మానుషీ చిల్లార్ హీరోయిన్ గా నటిస్తుండగా యదార్థ సంఘటనల స్పూర్తితో తెలుగు, హిందీ బై లింగ్యువల్ గా ఈ ప్రాజెక్ట్‌ గ్రాండ్ లెవెల్లో తెరకెక్కుతోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ పై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి.

కాగా నేటితో మూవీ యొక్క షూటింగ్ మొత్తం పూర్తి అయినట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితం అఫీషియల్ గా ప్రకటించారు. ఇందులో వరుణ్ తేజ్ ఫైటర్ పైలెట్ గా కనిపించనుండగా రాడార్ ఆఫీసర్ గా మానుషీ నటిస్తున్నారు. ఇక ఈ మూవీని సోనీ పిక్చర్స్, రెనాయ్‌సెన్స్ పిక్చర్స్ బ్యానర్లపై సందీప్ ముద్ద, నందకుమార్‌ అబ్బినేని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. డిసెంబర్ 8న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల ఆపరేషన్ వాలెంటైన్ ఆడియన్స్ ముందుకి రానుంది.

తాజా వార్తలు