లేటెస్ట్ వీడియో : విష్ణు మంచు ‘కన్నప్ప’ సెట్స్ లో కామెడీ కింగ్ సందడి

లేటెస్ట్ వీడియో : విష్ణు మంచు ‘కన్నప్ప’ సెట్స్ లో కామెడీ కింగ్ సందడి

Published on Dec 2, 2023 2:00 AM IST

kannappa
మంచు విష్ణు లేటెస్ట్ గా హీరోగా నటిస్తున్న లేటెస్ట్ ఫాంటసీ డ్రామా మూవీ కన్నప్ప. ఈ మూవీని ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తుండగా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏ వి ఏ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు గ్రాండ్ లెవెల్లో పాన్ ఇండియన్ రేంజ్ లో నిర్మిస్తున్నాయి.

ఇటీవల రిలీజ్ అయిన కన్నప్ప ఫస్ట్ లుక్ పోస్టర్ కి అందరి నుండి మంచి రెస్పాన్స్ లభించింది. శరత్ కుమార్, ప్రభాస్, నయనతార, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, మోహన్ బాబు వంటి వారు ఇందులో కీలక పాత్రలు చేస్తున్నారు.

ఈ మూవీ యొక్క షూటింగ్ కొన్నాళ్లుగా న్యూజీలాండ్ లో జరుగుతుండగా ఈ షెడ్యూల్ లో కామెడీ కింగ్ బ్రహ్మానందం కూడా పాల్గొన్నారని, ఆయన కాంబినేషన్ లో తెరకెక్కించిన ఎంటర్టైన్మెంట్ సన్నివేశాలు ఎక్కువ శాతం ఒక్క టేక్ లో ఓకే అవడంతో పాటు ఎంతో ఎంజాయ్ చేసాము అంటూ బ్రహ్మానందం, మోహన్ బాబు సహా టీమ్ అందరూ ఫన్నీగా మాట్లాడుతున్న వీడియోని మేకర్స్ కొద్దిసేపటి క్రితం తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ లో పోస్ట్ చేసారు. కాగా కన్నప్ప కు సంబందించిన మరిన్ని అప్ డేట్స్ త్వరలో ఒక్కొక్కటిగా రానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు