బాక్స్ ఆఫీసు వద్ద తన సినిమా విడుదల అవుతున్నప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ ఒకింత ఆందోళనలో ఉంటారంటే మీరు నమ్ముతారా? అవును ఇది నిజం.
రజనీ భార్య లతా రజనీ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో ఈ విషయాన్ని వెల్లడించారు. ఆమె సినిమాకి నిర్మాత కాకపోయినా సినిమా ప్రొడక్షన్ లో బాగా చురుకుగా పాల్గొంటుంది. అంటే కాకుండా ఈ సినిమాలో ఆమె ఓ పాటని కూడా పాడారు.
ఆమె భర్త గురించి మాట్లాడుతూ ‘ రజినీ ఇప్పటికీ కూడా అతని సినిమా విడుదలకు ముందు ఆతృతతో, ఒకింత ఆందోళనతో ఉంటారు. అతను సినిమా రంగంలో ఇప్పటికీ ఓ విద్యార్దే’ అని అన్నారు. నాలుగు సంవత్సరాల తరువాత రజనీకాంత్ నటించిన కొచ్చడియాన్ చిత్రం ‘మోషన్ కాప్చర్ టెక్నాలజీ’ వస్తుండటంతో దానిని రజనీ అభిమానులు స్వీకరిస్తారా? లేదన్నది? ఆసక్తిగా ఉంది.
సౌందర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రజనీ కాంత్ సరసన దీపికా పదుకొనే ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఏఆర్ రెహ్మన్ సంగీతం అందించిన ఈ చిత్రం మే 9 న అభిమానుల ముందుకు రానుంది.


