లారెన్స్ అంటే ఒక బ్రాండ్ – అల్లు అరవింద్

Published on Apr 17, 2019 11:01 pm IST

హారర్ సస్పెన్స్ జోనర్ లో భారీ హిట్ చిత్రం ముని సిరీస్ లో భాగంగా వస్తోన్న తాజా చిత్రం కాంచన 3. రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం ఏప్రిల్ 19వ తేదీన తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల కానుంది. అయితే తాజాగా ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చిత్రబృందం జరిపింది.

ఈ ఈవెంట్ లో పాల్గొన్న ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ రాఘవ లారెన్స్ గురించి మాట్లాడుతూ.. లారెన్స్ అంటే ఒక బ్రాండ్ అని.. అతని సినిమా అంటే ఒక ప్రత్యేకత ఉందని.. తెలిపారు. ఇక లారెన్స్ తన ట్రస్ట్ ను హైదరాబాద్ లో కూడా ప్రారంభిస్తున్న సందర్భంగా మెగాస్టార్ తన వంతుగా 10 లక్షలు విరాళం అందించిన విషయం తెలిసిందే.

సంబంధిత సమాచారం :