
‘అందాల రాక్షసి’ ఫేం లావణ్య త్రిపాఠి తెలుగులో మరో అవకాశం సొంతం చేసుకుంది. యువ హీరో నాని నటించబోయే రొమాంటిక్ కామెడీ సినిమాలో ఆమె హీరోయిన్. ‘ఈ రోజుల్లో’, ‘బస్ స్టాప్’, ‘కొత్త జంట’ సినిమాల దర్శకుడు మారుతి, వీరిద్దరూ జంటగా నటించే సినిమాకు దర్శకత్వం వహిస్తారు.
యూత్‌ఫుల్ లవ్ & కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి సిటీ గర్ల్ పాత్రలో కనిపిస్తుందని సమాచారం. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. నాని, లావణ్య త్రిపాఠిల జోడి కొత్తగా ఉంటుందని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.
నాగార్జున ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాతో పాటు, ‘అందాల రాక్షసి’ ఫేం నవీన్ చంద్ర సరసన మరో సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుంది.

