‘అందాల రాక్షసి’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన లావణ్య త్రిపాటికి మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో దిల్ రాజు నిర్మిస్తున్న ‘కేరింత’ సినిమాలో నటిస్తోంది. ఇది కాకుండా లావణ్య హీరోయిన్ గా నటించనున్న ఓ ద్విబాషా చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ఇది కాకుండా లావణ్య తాజాగా ఓ షార్ట్ ఫిల్మ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అసలు విషయంలోకి వెళితే ముంబైకి చెందిన ఫాషన్ డిజైనర్ మరియు ఫిల్మ్ మేకర్ అయిన ఆశిష్ నాయుడు డైరెక్ట్ చేయనున్న ఈ షార్ట్ ఫిల్మ్ టైటిల్ ’10:30′. దిశ అనే ఓ యంగ్ గర్ల్ ఎడ్యుకేషన్ ని తన పారెంట్స్ మధ్యలోనే ఆపేయాలి అనుకుంటారు. అసలు ఎంతో మంది అమ్మాయిల చదువులు మధ్యలోనే ఆగిపోతున్నాయి అనే అంశంపై ఈ షార్ట్ ఫిల్మ్ ని తీయనున్నారు. లావణ్య త్వరలోనే ఈ షార్ట్ ఫిల్మ్ షూట్ లో పాల్గొననుంది.


