అభిమాన హీరోతో లారెన్స్ మూడో సినిమా!

అభిమాన హీరోతో లారెన్స్ మూడో సినిమా!

Published on Jun 7, 2015 7:18 PM IST

nagarjuna-lawarens
నృత్య దర్శకత్వం నుంచి నేరుగా సినిమా దర్శకత్వానికి షిఫ్ట్ అయిన రాఘవ లారెన్స్ దర్శకుడిగానూ మంచి విజయాలను నమోదు చేశారు. ఆయన కెరీర్లో ‘కాంచన’, ‘ముని’, ‘కాంచన 2’ సినిమాలు గుర్తుంచుకోదగ్గ సినిమాలుగా చెప్పుకోవచ్చు. అయితే దర్శకుడిగా లారెన్స్‌కి లైఫ్ ఇచ్చింది మాత్రం కింగ్ నాగార్జునే! నాగార్జున హీరోగా నటించిన ‘మాస్’ సినిమా ద్వారా లారెన్స్ దర్శకుడిగా మారిపోయిన విషయం తెలిసిందే. ఆ సినిమా విజయం సాధించడంతో లారెన్స్ దర్శకుడిగా బిజీ అయిపోయారు.

‘మాస్’ తర్వాత నాగార్జునతో ‘డాన్’ అనే సినిమా కూడా చేసిన లారెన్స్, నాగార్జునపై తన అభిమానాన్ని ఎప్పుడూ చాటుకుంటూనే ఉంటారు. తాజాగా లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంచన 2’ తెలుగు, తమిళ భాషల్లో ఘన విజయాన్ని సొంతం చేసుకొని టాప్ దర్శకుల లిస్ట్‌లో చేరిపోయారు. ‘కాంచన 2’ తర్వాత పలువురు పెద్ద హీరోలతో పనిచేయనున్నట్లు చాలా వార్తలు వినిపించాయి. ఆ కోవలోనే లారెన్స్ నాగార్జునతో కలిసి పనిచేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే లారెన్స్ చెప్పిన కథకు నాగార్జున ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ కాంబినేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు