వైరల్ అవుతోన్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సెట్ ఫోటో !

Published on Jan 22, 2019 12:07 am IST

రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’తో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగానే హడావుడి చేస్తున్నాడు. ఇప్పటికే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నుండి ఫస్ట్ లుక్ ను ఇటీవలే విడుదల చేశారు. అలాగే లక్ష్మి పార్వతి, చంద్రబాబుకు సంబంధించిన లుక్స్ కూడా రిలీజ్ చేసిన వర్మ మొత్తానికి సినిమా పై బాగానే అంచనాలు పెంచుతున్నాడు.

కాగా తాజాగా వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సెట్ ఫోటోను కూడా విడుదల చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఫొటోలో ఎన్టీఆర్ పాత్రదారి, మిగిలిన పాత్రదారులతో కలిసి భోజనం చేస్తున్న ఫోటో ఇది. ఇక ఇప్పటికే వెన్నుపోటు సాంగ్ లో నేరుగా చంద్రబాబు నాయుడిని కించపరుస్తూ లిరిక్స్ పెట్టిన వర్మ.. సినిమాలో ఇంకెలాంటివి పెట్టి తెలుగు తమ్ముళ్ళలో ఆగ్రహాఆవేశాలను నింపుతాడో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More