కత్తి హిందీ రీమేక్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ దర్శకుడు !

కత్తి హిందీ రీమేక్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ దర్శకుడు !

Published on Aug 19, 2018 7:50 PM IST

vijay21
ఇళయదళపతి విజయ్, సమంత జంటగా మురుగదాస్ తెరక్కించిన చిత్రం ‘కత్తి’. 2014లో విడుదలైన ఈచిత్రం బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. మంచి మెసేజ్ తో కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈచిత్రం తెలుగులో ‘ఖైదీ నంబర్ 150’ గా రీమేక్ అయ్యింది. వి వి వినాయక్ తెరకెక్కించిన ఈచిత్రంలో మెగాస్టార్ చిరంజీవి నటించారు. 2017లో విడుదలైన ఈచిత్రం సూపర్ హిట్ సాధించింది.

ఇక ఇప్పుడు ఈ చిత్రం హిందీ లో రీమేక్ కానుంది. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్ర హక్కులను దక్కించుకున్నారు. అయితే ఈచిత్రాన్ని ఆయనే తెరకెక్కిస్తారా లేక హోమ్ బ్యానర్ భన్సాలీ ప్రొడక్షన్స్ లో మరో దర్శకుడితో ఈ రీమేక్ ను నిర్మిస్తారో తెలియాల్సివుంది.

తాజా వార్తలు