సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కెజిఎఫ్2 విలన్ లీక్డ్ లుక్

Published on May 21, 2020 11:11 am IST

సౌత్ ఇండియాలో తెరకెక్కుతున్న క్రేజీ చిత్రాలలో కెజిఎఫ్2 ఒకటి. 2018లో విడుదలైన కెజిఎఫ్ మొదటి పార్ట్ సంచలన విజయం నమోదు చేయడంతో సీక్వెల్ పై దేశవ్యాప్తంగా అంచనాలు నెలకొని ఉన్నాయి. యష్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకోగా అక్టోబర్ 23న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కాగా కెజిఎఫ్ 2లో ప్రధాన విలన్ అధీర పాత్రను బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ చేయడం విశేషం.

ఇప్పటికే కెజిఎఫ్ 2 నుండి ఆయన ఫస్ట్ లుక్ విడుదల చేయగా విపరీతమైన స్పందన దక్కించుకుంది. కాగా ఈ మూవీలోని సంజయ్ లుక్ మరొకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో భయంకరంగా ఉన్న సంజయ్ దత్ లేటెస్ట్ లుక్ సినిమాపై ఆసక్తి రేపుతోంది. ప్రస్తుత లుక్ సెట్స్ నుండి లీకైనదిగా తెలుస్తుంది. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటిస్తుండగా, రవీనా టాండన్ ఓ కీలక రోల్ చేస్తుంది.

సంబంధిత సమాచారం :

X
More