
గత సంవత్సరం వేసవి కానుకగా విడుదలై నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సినిమా, ‘లెజెండ్’. మార్చి 28, 2014న విడుదలైన ఈ సినిమా ఇప్పటికే ఏడాది పూర్తి చేసుకుంది. ఇటు కలెక్షన్ల పరంగానూ, అటు విమర్శకుల ప్రశంసల పరంగానూ సూపర్ అనిపించుకున్న లెజెండ్.. లాంగ్ రన్‌లో కూడా స్టడీగా నిలబడింది. ప్రస్తుతం ఎమ్మిగనూరులో ఈ సినిమా ఇంకా ప్రదర్శితమౌతోంది.
బాలయ్య తాజాగా నటించిన ‘లయన్’ సినిమా ఆడియో ఆవిష్కరణ వేడుక నిన్న జరిగింది. ఈ సందర్భంగా ‘లెజెండ్’ సినిమా గురించి బాలకృష్ణ కాసేపు మాట్లాడారు. లెజెండ్ సూపర్ హిట్‌గా నిలిచి ఏడాది పూర్తైన సందర్భంగా ఆ సినిమా ప్రదర్శితమౌతున్న ఎమ్మిగనూరులో ఓ వేడుక నిర్వహించనున్నట్లు తెలిపారు. మే 2వ తేదీన ఈ వేడుకను నిర్వహించనున్నట్లు బాలకృష్ణ స్వయంగా తెలిపారు.
ఇక బాలయ్య తాజా చిత్రం ‘లయన్’ విషయానికి వస్తే.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదలవనుంది. విడుదలకు ముందే ఈ సినిమా సాటిలైట్ రైట్స్ ఏకంగా 6కోట్ల రూపాయలకు అమ్ముడై సినిమాపై అంచనాల్ని పెంచింది. సత్యదేవా దర్శకుడిగా పరిచమవుతున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం సమకూర్చారు.

