
నందమూరి నట సింహం బాలకృష్ణ నటిస్తున్న తాజా సినిమా ‘లయన్’. ఈ సినిమాను మార్చ్ 28న విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. గత ఏడాది ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్ సినిమా బాలయ్య ఖాతాలో చేరింది. ‘లెజెండ్’ సినిమా మార్చ్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సెంటిమెంట్ ఫాలో అవుతూ ‘లయన్’ను కూడా మార్చ్ 28న విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ సినిమాలో బాలకృష్ణ సిబిఐ ఆఫీసర్ గా, సామాన్యుడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు.
ఈ సినిమాలో బాలయ్య సరసన త్రిష, రాధిక ఆప్టే హీరోయిన్లుగా నటిస్తున్నారు. సత్యదేవ దర్శకత్వం వహిస్తున్నారు. రుద్రపాటి రమణారావు నిర్మాత. యాక్షన్ ఎంటర్టైనర్ గా అభిమానులను అలరించే అన్ని అంశాలతో సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది.