లెజెండ్ శరవణన్ హీరోగా సినిమా సెట్టైంది

Published on Jun 18, 2019 12:00 am IST

టీవీలతో పరిచయం ఉన్నవారికి లెజెండ్ శరవణన్ అంటే తెలియకుండా ఉండదు. శరవణన్ స్టోర్స్ అధినేతగా ఈయన బాగా పాపులర్. తన వస్త్ర, జ్యూవెలరీ వ్యాపారానికి అవసరమైన ప్రకటనల్లో హన్సిక, తమన్నా లాంటి స్టార్ హీరోయిన్లతో నటించిన ఈయనకు సినిమా హీరోగా మారాలని చాలా కోరిక. ఆ ప్రకారమే ప్రయత్నాలు చేసి చివరికి ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నారు.

మొదట్లో శరవణన్ యాడ్స్ చూసి క్రిటిసిజమ్ చేసిన జనం సైతం మెల్లగా ఆయన్ను యాక్సెప్ట్ చేసి, ఆయన హీరోగా నటించబోయే సినిమా పట్ల ఆసక్తి చూపుతున్నారు. ఇంతకీ ఈయన్ను డైరెక్ట్ చేయనుంది ఒక దర్శకుడు కాదు.. ఇద్దరు. వాళ్ళే జెడి, జెర్రీ. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో లాంచ్ కానున్న ఈ సినిమాను 2020 ఏప్రిల్ 14న విడుదలచేయనున్నారు. కేవలం తాను కనిపించే ప్రకటనల కోసమే పెద్ద ఎత్తున ఖర్చు చేసే శరవణన్ హీరోగా నటించనున్న సినిమాకు భారీగా ఖర్చు పెడతారని తమిళ సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

సంబంధిత సమాచారం :

X
More