సీనియర్ నటి వాణిశ్రీ ఇంట తీవ్ర విషాదం.

Published on May 23, 2020 12:04 pm IST

లెజెండరీ నటి వాణిశ్రీ ఇంటిలో పెను విషాదం చోటు చేసుకుంది. ఆమె కుమారుడు అభినయ వెంకటేష్ ఆకస్మిక మరణం పొందినట్లు తెలుస్తుంది. ఆయన గుండె నొప్పితో గత రాత్రి నిద్రలోనే తుది శ్వాస విడిచినట్లు సమాచారం. ఉదయాన్నే ఆయన చలనం లేకుండా బెడ్ పై పడి ఉండడం గమనించి, ఆయన్ని ఆసుపత్రికి తరలించగా, వైద్యులు మరణించినట్లు ధృవీకరించారు. చెంగల్పట్టు జిల్లా తిరుకలు కుండ్రం ఫార్మ్ హౌస్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.

వృత్తి రీత్యా డాక్టర్ అయిన అభినయ వెంకటేష్ చెనై అన్నపూర్ణ మెడికల్ కళాశాలలో డాక్టర్ గా పని చేస్తునట్లు సమాచారం. వాణిశ్రీకి అనుపమ అనే ఓ కుమార్తె ఉండగా, వెంకటేష్ ఒక్కగానొక్క కుమారుడు. ఆయన మరణంతో వాణిశ్రీ శోకంలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న చిత్ర ప్రముఖులు వారి కుటుంబానికి సంతాపం తెలియజేశారు.

సంబంధిత సమాచారం :

X
More