లెజెండరీ గాయకులు స్వర్గీయ ఎస్పీ బాలు గారికి పద్మవిభూషణ్ సత్కారం.!

Published on Jan 26, 2021 7:03 am IST

సంగీత సామ్రాజ్యం లోనే తనది ఒక అధ్యాయం. మళ్లీ రానిది ఎవరి వల్ల కానిది ఒక్క ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికే చెల్లింది. యుగానికి ఒక్కటే ఉండే ఆ గాత్రం కోట్ల మందిని కన్నీటి పర్యంతం చేసి స్వర్గానికి ఎగసింది. అయితే ఆయన పాట మాత్రం ఇంకా ఆగలేదు ఆగబోదు. మరి ఇదిలా ఉండగా ఆయనకు మరో సత్కారం వరించింది.

ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన పద్మవిభూషణ్ అవార్డ్ ను ప్రకటించారు. మొత్తం 7గురికి విభూషణ్ 1మందికి భూషణ్ అవార్డులు ప్రకటించిన కేంద్రం స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి పద్మవిభూషణ్ కూడా ప్రకటించింది. దీనితో ఎన్నో రివార్డులు అందుకున్న బాలు ఖాతాలో మరో అవార్డ్ వచ్చిందని చెప్పాలి.

సంబంధిత సమాచారం :