బేబీ లెంగ్త్ కొంచెం ఎక్కువే.. పర్లేదా ?

బేబీ లెంగ్త్ కొంచెం ఎక్కువే.. పర్లేదా ?

Published on Jul 4, 2019 4:20 PM IST

సమంత నయించిన ‘ఓ బేబీ’ రేపు విడుదలకానున్న సంగతి తెలిసిందే. దీంతో చిత్ర యూనిట్ సెన్సార్ కార్యక్రమాల్ని ముగించింది. ఈ ఫన్ ఎంటర్టైనర్ సెన్సార్ బోర్డు మెంబర్లని మెప్పించి క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ పొందింది. ఇక సినిమా రన్ టైమ్ చూస్తే 2 గంటల 40 నిముషాలుగా ఉంది. ఇది సాధారణ సినిమాల నిడివితో పోలిస్తే ఎక్కువే అనాలి. ఇంత లెంగ్త్ ఉన్న సినిమాను ప్రేక్షకులు భరించగలరా అనే సందేహం వ్యక్తమవుతోంది కొందరిలో.

అయితే గతంలో ఇలాగే ఎక్కువ రన్ టైమ్ కలిగిన చిత్రాలు కొన్ని బాక్సాఫీస్ వద్ద భారీ విజయాల్ని సాధించిన సందర్భాలున్నాయి. ఉదాహరణకి ‘రంగస్థలం, అర్జున్ రెడ్డి’. ఈ రెండు సినిమాల నిడివి ఎక్కువే అయినా కంటెంట్ బాగుంటుంది కాబట్టి ప్రేక్షకులు ఇబ్బంది ఫీలవ్వకుండా చిత్రాన్ని ఎంజాయ్ చేశారు. కనుక ‘ఓ బేబీ’లో కూడా మంచి ఫన్, ఎమోషన్ ఉంటే ప్రేక్షకులు 2 గంటల 40 నిముషాల సినిమాను భరించగలరు. ఇకపోతే నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు