అక్కినేని హీరో అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘లెనిన్’ మరికొద్ది గంటల్లో వరల్డ్‌వైడ్ గ్రాండ్ రిలీజ్కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు డైరెక్ట్ చేస్తుండగా పూర్తి రూరల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇక ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో అఖిల్ ఉన్నాడు. రిలీజ్‌కు రెడీ అయిన ఈ చిత్రం సెన్సార్ పనులు కూడా కంప్లీట్ చేసుకుంది.
ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ సభ్యులు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. ఇక ఈ సినిమాను 2 గంటల 38 నిమిషాల రన్‌టైమ్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమా కోసం మేకర్స్ పక్కా ప్లానింగ్‌తో రన్‌టైమ్‌ను లాక్ చేశారు. ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌కు ఈ రన్‌టైమ్ పర్ఫెక్ట్‌గా ఉంటుందని వారు భావిస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్ తన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.



