బాక్సాఫీస్ వద్ద అఖిల్ ‘లెనిన్’ చిత్రం భారీ విజయాన్ని నమోదు చేస్తోంది. ఈ చిత్రం భారీ వసూళ్లతో ప్రారంభమై, తర్వాత రెండు రోజుల్లోనూ మంచి కలెక్షన్స్ ను సాధించి, మొదటి వారాంతాన్ని విజయవంతంగా ముగించింది. ముఖ్యంగా నైజాం ప్రాంతంలో ఈ సినిమా అద్భుతమైన వసూళ్లను రాబట్టింది. మొదటి మూడు రోజుల్లో ఈ ప్రాంతంలో సుమారు రూ. 12 కోట్లు వసూలు చేయగా, ఆదివారం నాడు అత్యధిక వసూళ్లు సాధించడం విశేషం. ఐతే, ఇప్పుడు కీలకమైన ‘సోమవారం పరీక్ష’ మొదలైంది.
ఇకపై ఈ చిత్రం తన థియేట్రికల్ ప్రయాణాన్ని ఎంత విజయవంతంగా కొనసాగిస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో సునీల్, బ్రహ్మాజీ, శివాజీ మరియు ఈశ్వరీ రావు వంటి సహాయ నటీనటులు ఉన్నారు. కాగా ఈ సినిమాలో అందాల భామ భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. మొత్తానికి ఈ సినిమా పై అఖిల్ పెట్టుకున్న హోప్స్ నిజం అయ్యాయి. ఈ సినిమాకి థమన్ అద్భుతమైన సంగీతం అందించారు. మ్యూజిక్ కూడా సినిమాకి బాగా ప్లస్ అయింది.
