సెన్సేషన్ రెస్పాన్స్ తో దూసుకు పోతున్న “లియో” ట్రైలర్!

సెన్సేషన్ రెస్పాన్స్ తో దూసుకు పోతున్న “లియో” ట్రైలర్!

Published on Oct 6, 2023 9:00 PM IST

leo

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో, టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజు దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ లియో. ఈ చిత్రం ను అక్టోబర్ 19, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ఇప్పటికే ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సెన్సేషన్ రెస్పాన్స్ వచ్చింది. అయితే నిన్న మేకర్స్ ఈ సినిమా కి సంబందించిన ట్రైలర్ ను విడుదల చేయడం జరిగింది.

తమిళ, తెలుగు భాషలలో పాటుగా, ఇతర భారతీయ ప్రధాన బాషల్లో సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ కి సెన్సేషన్ రెస్పాన్స్ వస్తోంది. ఈ ట్రైలర్ కి తమిళం లో ఇప్పటి వరకూ 32 మిలియన్స్ కి పైగా వ్యూస్ వచ్చాయి. 2.6 మిలియన్స్ కి పైగా లైక్స్ వచ్చాయి. అయితే తెలుగు లో కూడా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. 5.4 మిలియన్స్ కి పైగా వ్యూస్ రాగా, 433కే కి పైగా లైక్స్ వచ్చాయి. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. త్రిష, సంజయ్ దత్, అర్జున్, ప్రియా ఆనంద్ కీలక పాత్రల్లో నటిస్తుండగా, రాక్ స్టార్ అనిరుద్ రవి చందర్ సంగీతం అందించారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

తాజా వార్తలు