చెన్నై నీటి కరువుపై స్పందించిన హాలీవుడ్ హీరో

Published on Jun 26, 2019 7:31 pm IST

దక్షిణాది భారతంలోని ప్రధాన నగరాల్లో ఒకటైన చెన్నై మహానగరం తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటోంది. భూగర్భ జలాలు బాగా తగ్గిపోవడంతో తాగు నీటి కోసం కూడా జనం ఇబ్బందిపడాల్సిన పరిస్థితి. ఈ ఉదంతంపై ఇప్పటికే అనేకమంది తమిళ సినీ నటులు, ఇతర సెలబ్రిటీలు స్పందించి మనం ఇకపై నీటి పట్ల జాగ్రత్త వహించాలని, నీటిని కాపాడుకోవాలని పిలుపునిస్తూ తోచిన సహాయం చేస్తుండగా తాజాగా హాలీవుడ్ టాప్ హీరో లియోనార్డో డి కాప్రియో సైతం చెన్నై పడుతున్న కష్టం పట్ల స్పందించారు.

చెన్నైలోని ఒక ఎండిపోయిన బావి వద్ద మహిళలంతా నీటి కోసం కష్టాలుపడుతున్న ఫోటో ఒకదాన్ని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసిన ఆయన వర్షమే ఈ నగరాన్ని కాపాడాలి. ప్రధానమైన నీటి వనరులన్నీ ఎండిపోవడంతో చెన్నైలో కరువు ఎదురైంది. ఈ పరిస్థితి నగర జనాన్ని ప్రభుత్వ ట్యాంకర్ల వద్ద గంటల తరబడి నేటి కోసం క్యూలో నిలబడేలా చేసింది. హోటళ్లు, రెస్టారెంట్లు మూతబడ్డాయి. అధికారులు ప్రత్యాన్మాయాల కోసం వెతుకుతున్నారు. కొందరు వర్షం కోసం ప్రార్థిస్తున్నారు అంటూ వివరంగా పేర్కొన్నారు. దీన్నిబట్టి చెన్నై కరువును ప్రపంచం దృష్టిని ఆకర్షించేంత తీవ్రమైనదని అర్థమవుతోంది.

సంబంధిత సమాచారం :

X
More